ఆయిల్ పాం తోటలోని ఖాళీ స్థలంలో మొదటి మూడు సంవత్సరాలు అంతర పంటలు వేసుకుని అధిక ఆదాయం పొందవచ్చని జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవిచంద్ర బాబు తెలిపారు. బుధవారం చిట్వేలిలో ఆయిల్ పాం సాగు పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఆయిల్ పాం మొక్కల ఖరీదుపై 100% రాయితీతో హెక్టార్ కు 125 విదేశీ మొక్కలను ఉచితంగా ఇచ్చి ఎరువుల కోసం ఒక సంవత్సరానికి 4589 రూపాయలు, అంతర పంటల సాగుకు 5250 సబ్సిడీ అందిస్తామన్నారు.