తొండూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని బోడివారిపల్లె గ్రామంలో జరుగుతున్న వైద్య శిబిరాన్ని బుధవారం జిల్లా వైద్య అరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు సందర్శించారు. వారు మాట్లాడుతూ దోమ కాటు వలన మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, మెదడువాపు, బోదకాలు వంటి వ్యాధులు వస్తాయని, ఈ వ్యాధులు రాకుండా ఉండాలంటే పనికిరాని గుంతలను లోతట్టు ప్రదేశాలను వాడిని బావులను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
![]() |
![]() |