మాకివలస భూములపై హక్కులు ఎవరికి ఉన్నాయో రెవెన్యూ అధికారులు తెలిపేవరకు ఎవరూ ఆ భూముల్లోకి వెళ్లి తగాదాలు పడవద్దని టెక్కలి డీఎస్పీ కె.బాలచంద్రారెడ్డి అన్నారు. మాకివలస భూములపై తప్పుడు పత్రాలు సృష్టిం చి విక్రయించారని పేర్కొంటూ ఎల్‌ఎన్‌పేట మండలానికి చెందిన ఊణ్ణ సత్యనారాయణ గుప్తపై ఎస్టీ కమిషన్‌కు స్థానిక గిరిజ నులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కమి షన్ ఆదేశాల మేరకు డీఎస్పీ బుధవారం ఇరువర్గాలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి చర్చించారు. ఈ భూములపై రికార్డుల పరంగా హక్కులు ఎవరికి ఉన్నాయో తెలియజేయాలని తహసీల్దార్‌కు, ఆర్డీవోకు లేఖలు రాయాలని ఎస్ఐకి సూచించారు. రెవెన్యూ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చే వరకు ఇరువర్గాలు ఆ భూములపైకి వెళ్లకూడదని సూచించారు. ఎవరైనా తొందరపడి భూములపైకి వెళితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్.ఐ కె.మధుసూదనరావు ఉన్నారు.