మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో కీలక ఫైళ్లు దగ్దం కేసులో పోలీసులు అనుమానిస్తున్న వైసీపీ నాయకుడు రైస్‌మిల్లు మాధవరెడ్డితో పాటు అతని సన్నిహితులను కూడా పోలీసులు విచారిస్తే మరిన్ని కుట్రలు బయటపడతాయని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్‌జే వెంకటేశ అన్నారు. బుధవారం స్థానిక నిమ్మనపల్లె సర్కిల్ వద్ద టీడీపీ కార్యాలయం లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫైళ్ల దగ్దం కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, ఈ ఘటనలో వైసీపీ నాయకులకు చెందిన 22-ఏ ఫైళ్లతో పాటు సామాన్య ప్రజలకు చెందిన విలువైన ఫైళ్లు తగలబడి పోయాయన్నారు. ఇక్కడ పనిచేసిన ఆర్డీవో మురళి హయాంలో ఎక్కువగా అక్రమాలు జరిగాయని ఆరోపించా రు. దీనినంతటినీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి వెనుక వుండి నడిపారన్నారు. మాధవరెడ్డి ఇంట్లో సోదాలు చేసిన పోలీసులకు రెండు బస్తాల్లో రెవెన్యూ రికార్డులు లభించినట్లు తెలిసిందని, అదే విధంగా అతని సన్నిహితులైన తట్టివారిపల్లెకు చెందిన వైసీపీ నాయకుడు, మున్సిపల్ సీనియర్ కౌన్సిలర్, సీటీఎం ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకుడి నివాసాల్లో సోదాలు చేసివుంటే మరిన్ని సాక్ష్యాలు బయటపడేవని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకుడు అన్వర్‌బాషా పాల్గొన్నారు.