కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వ మనుగడకు 16 మంది ఎంపీలను అందించిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తప్ప ఇంకేది అవసరం లేదని వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం(జులై 26) ఈ విషయమై ఆయన ఎక్స్‌లో ఒక ట్వీట్ చేశారు. ‘కేంద్రం ఏర్పాటు చేసే అదనపు రుణాలు, ప్రత్యేక ప్యాకేజీ, మినహాయింపులు ఏవీ వద్దు. ఒక్క ప్రత్యేక హోదానే కావాలి. కేంద్ర బడ్జెట్ మాకు మాటల గారడిలా ఉంది అని విజయసాయిరెడ్డి విమర్శించారు.