ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అశ్లీల వీడియోలు చూసి చెల్లిపై అన్న అత్యాచారం

national |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2024, 09:03 PM

మధ్యప్రదేశ్‌లో అశ్లీల వీడియోలు చూసిన 13 ఏళ్ల బాలుడు.. తన సొంత చెల్లినే రేప్ చేశాడు. ఈ విషయాన్ని తండ్రికి చెప్తానని 9 ఏళ్ల చెల్లి బెదిరించడంతో భయపడిన ఆ బాలుడు.. ఆమెను గొంతు నొక్కి హతమార్చాడు. అయితే ఈ విషయం కాస్తా ఆ బాలుడి తల్లి, ఇద్దరు అక్కలకు తెలిసింది. వారు ఆ ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించడం పెను సంచలనంగా మారింది. ఆ బాలిక మృతదేహాన్ని ఇంటి బయట పడేసిన కుటుంబ సభ్యులు.. చనిపోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ కేసును ఛేదించి చివరికి వాళ్లే నిందితులు అని తేల్చారు. ఈ ఘటన 3 నెలల క్రితం జరగ్గా.. తాజాగా నిందితులను గుర్తించారు.


మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో జరిగిన ఈ సంఘటన సభ్య సమాజం తల దించుకునేలా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 24 వ తేదీన ఒక ఇంటి ప్రాంగణంలో రాత్రిపూట పడుకున్న 9 ఏళ్ల బాలిక చనిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఏదో విష పురుగు కుట్టడం వల్ల ఆ బాలిక చనిపోయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. అయితే ఆ బాలికపై అత్యాచారం జరిగిందని.. గొంతు నొక్కడం వల్లే చనిపోయిందని పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో తేలడం తీవ్ర సంచలనంగా మారింది. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


బాలిక కుటుంబ సభ్యులతో పాటు మొత్తం 50 మందిని స్థానిక పోలీసులు ప్రశ్నించారు. రాత్రి సమయంలో ఆ ఇంటి లోపలికి ఎవరూ వచ్చే అవకావం లేదని గుర్తించారు. ఈ క్రమంలోనే ఆ బాలిక కుటుంబ సభ్యులు చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేకపోవడంతో వారిపైనే పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో చివరికి వారిని గట్టిగా ప్రశ్నించగా జరిగిన విషయం మొత్తం పోలీసులకు వివరించారు.


 అశ్లీల వీడియోలు చూసి వాటి ప్రభావానికి గురైన ఆ 13 ఏళ్ల అన్న.. రాత్రి పూట నిద్రిస్తున్న తన 9 ఏళ్ల చెల్లిపై అత్యాచారం చేశాడని వారు పోలీసులు చెప్పారు. ఈ విషయాన్ని తన తండ్రికి చెబుతానని ఆమె బెదిరించడంతోనే గొంతు నొక్కి హత్య చేశాడని గుర్తించారు. చెల్లిని చంపిన తర్వాత ఆ బాలుడు జరిగిన ఘటన మొత్తం తన తల్లికి చెప్పాడని వెల్లడైంది. ఇక ఆ బాలుడి చేసిన పనికి 17, 18 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు అక్కలకు కూడా తెలుసని గుర్తించారు. దీంతో వారంతా కలిసి అతడు చేసిన తప్పును కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చివరికి దొరికిపోయారని పోలీసులు వెల్లడించారు. దీంతో ఆ బాలుడ్ని అదుపులోకి తీసుకున్నామని.. తల్లి, ఇద్దరు అక్కలను అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. ఈ కేసుపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com