కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, 80 ఏళ్ల పైబడి వయసున్న కురువృద్ధుడు, మాజీ మంత్రి హరిరామ జోగ య్య మళ్లీ రచ్చ స్టార్ట్ చేశారు. తాజాగా ఆయన ఏపీ ప్రబుత్వానికి లేఖ సంధించారు. కాపుల సంగతేంటో తేల్చండి! అంటూ.. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఆయన టార్గెట్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 50 రోజులు అయినా.. కాపుల రిజర్వేషన్ విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.ఆర్థికంగా వెనుక బడిన వర్గాలకు కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లో 5 శాతాన్ని కాపులకు ఇస్తూ.. గతంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. దీనిని కేంద్రం ఆమోదించిందో లేదో కూడా తెలియదని.. ఇప్పటి వరకు దీనిని వైసీపీ సర్కారు తొక్కిపెట్టిందని, మరి ఇప్పుడు ఏం చేస్తారని జోగయ్య నిలదీశారు . ఇప్పుడు కేంద్రంలోనూ. రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వమే కాపులకు న్యాయం చేయాల ని జోగయ్య డిమాండ్ చేశారు.కాపుల సుదీర్ఘ డిమాండ్‌కు ఇప్పుడు కూడా న్యాయం చేయకపోతే. మున్ముందు ఉద్యమాలు తప్పవని ఆయన పరోక్షంగా హెచ్చరించారు