మార్చి 22న విశాఖ పోర్టుకు దిగుమతైన రూ. 25 వేల కోట్ల డ్రగ్స్ కేసు ఏమైందని.. సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్ట్స్ సంస్ధ ఇంపోర్ట్ చేసినట్లు అప్పట్లో తెలిపారని.. ఆ సంస్ధతో బీజేపీ పెద్దలకు సంబంధాలున్నాయని తెలిసిందని వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు వైసీపీ పార్టీపై నిందలు వేశారని, పార్లమెంటులో ఎంపీలు ఈ విషయాన్ని ప్రశ్నించాలని, వాస్తవాలు ఏంటి? ఎందుకు ఉపేక్షిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.గుజరాత్, మహారాష్ట్రల నుంచి డ్రగ్స్ ఇంపోర్ట్ అవుతుండటం చూశామని, విశాఖ పోర్టుకు ఎప్పుడూ ఇలాంటి మచ్చరాలేదని బొత్స సత్యనారాయణ అన్నారు. చిత్తశుద్ది వుంటే స్ధానిక నాయకత్వం వెంటనే నివేదిక తెప్పించాలన్నారు. ఎన్నికల సమయమని రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు అప్పట్లో వద్దనుకున్నామని, ఎవరిమీదో బురద చల్లడానికి తాను అడగడంలేదన్నారు. ఎవరు తప్పు చేస్తే వారికి శిక్ష వేయాలని.. భూ కుంభకోణాలపై టీడీపీ హయాంలో వేసిన సిట్ నివేదికను బయటపెట్టాలన్నారు.