ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్ఈఆర్) అన్నారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ పిన్నింటి రజినిసాయి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. అంగన్వాడీ కేం ద్రాలను, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పెద్దపీఠ వేస్తానన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరి నెల రోజులకే 300 మంది యువతీ, యువకులకు వివిధ పరిశ్రమల్లో ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. తోటపల్లి నీరు వారం రోజుల్లో ఈ ప్రాంతానికి వస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై వివరించారు. కార్య క్రమంలో ప్రత్యేక ఆహ్వానితుడు పిన్నింటి సాయికుమార్, జడ్పీటీసీ టొంపల సీతారాముడు, వైస్‌ఎంపీపీ బుజ్జి, ఎంపీడీవో వెంకటరమణ, ఏడీ దుర్గారావు తదిత రులు పాల్గొన్నారు. ఎంపీడీవో కార్యాలయం వెనుక కూరగాయల మార్కెట్ ఏర్పా టు చేసేందుకు ఎమ్మెల్యే ఎన్ఈఆర్ స్థల పరిశీలన చేశారు.