ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్ జగన్‌గారికి న్యాయం చేయాలి.. భుత్వానికి నాగబాబు రిక్వెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 29, 2024, 08:32 PM

జనసేన పార్టీ నేత, మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై 2019 ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో జరిగిన దాడి ఘటననను ప్రస్తావించారు. ఆయనకు న్యాయం చేయాలంటూ ఏపీ ప్రభుత్వ పెద్దలను రిక్వెస్ట్ చేశారు. '2019కి ముందు అప్పటి ఎమ్మెల్యేగా ఉండి తదనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మారి.. ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలి' అన్నారు నాగబాబు.


  'ఎందుకంటే 2019 శ్రీను అనే వ్యక్తి ఆయన మీద కోడికత్తితో దాడి చేసాడు. 5 ఏళ్లు అయిన కూడా ఆ కేస్ ఇంకా కొలిక్కి రాలేదు. అప్పుడంటే జగన్ మోహన్ రెడ్డిగారికి ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల ఆయనకి కుదర్లేదు. ఇపుడు ఆయన ఖాళీగానే ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఆయనకి న్యాయం చెయ్యాల్సిన అవసరం అత్యవసరంగా ఉంది. కాబట్టి అతని మీద హత్యాయత్నం చేసిన నేరస్థుడికి సరైన శిక్ష విధించాలి కదా. కాబట్టి ఆయన కేస్ ని తక్షణమే విచారించి అమాయకుడు అయినటువంటి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి న్యాయం చెయ్యవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని, సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, హోం మంత్రి గారిని కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్ చేశారు.


'చిన్నప్పుడు.. నా బలపం కొట్టేశాడు, నా పెన్సిల్ విరకొట్టాడు, నన్ను గిల్లాడు అని పెద్దయ్యాక పగ తీర్చుకుంటారా ఎవరైనా.. ఈ senseless statements ఏంటసలు..? మీకు సలహాలెవరిస్తున్నారు స్వామి.. మీరు మాట్లాడేది మీకైన కామెడిగా లేదా, ఇతన్నేనా మనం 2019-2024 వరకు సీఎంగా ఎన్నుకున్నది అని ప్రజలు షాక్ లో ఉన్నారు.. ఇకనైనా మీరు చేసే commentsకి కొంచెం Common sense add చేయండి YCP MLA Jagan గారు' అంటూ మరో ట్వీట్ కూడా చేశారు.


ఏపీ ప్రభుత్వం కొన్ని పథకాల పేర్లను మార్చడంపై నాగబాబు ఎక్స్‌ వేదికగా స్పందించారు. గత 45 ఏళ్లుగా తాను చూసిన చాలా ప్రభుత్వాల్లో అరకొర తప్ప.. ఇలా చాలా ప్రభుత్వ పథకాలకి భారతదేశపు కీర్తిపుటలల్లో నిలిచిపోయిన మహనీయుల పేర్లు పెట్టడం కూటమి ప్రభుత్వపు పురోగతికి మచ్చుతునకగా చెప్పొచ్చన్నారు. ఈ పథకాల మార్పుకి నాంది పలికిన కూటమి నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప‌ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి మనస్పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు. ఇలాంటి మరిన్నో గొప్ప పనులకి మున్ముందు శ్రీకారం చుట్టాలని ఆకాంక్షించారు. నాగబాబు ఆంధ్రప్రదేశ్‌లో తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com