ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహనా కల్పించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 03:52 PM

బాల్య వివాహాలవల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం అనంతపురం ఐసీడీఎస్‌ శాఖ బాల్యం చదువుకోసం.. వివాహం కోసం కాదు అంటూ ప్రత్యేక స్లోగనతో పోస్టర్లు ముద్రించారు. పోస్టర్లను సోమవారం రెవెన్యూభవనలో కలెక్టరు వినోద్‌ కుమార్‌ చేతులు మీదుగా ఆవిష్కరించారు. ఇదే సమయంలో గార్లదిన్నె మండలం కల్లూరుకు చెందిన రజియాబేగం బాల్యవివాహాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించడంలో మంచి ప్రతిభ కనబరుస్తుండటంతో ఆమెను కలెక్టరు అవార్డు, ప్రశంసాపత్రం అందజేసి అభినందించారు. ఐసీడీఎస్‌ పీడీ శ్రీదేవి, జిల్లా చైల్డ్‌ప్రొటెక్షన అధికారి మంజునాథ్‌, ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ కృష్ణమాచారి పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com