ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెడికవర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 03:53 PM

విశాఖ పరిధిలోని వెంకోజిపాలెంలోని మెడికవర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రి సెల్లార్‌లోని బ్యాటరీల మెయింటనెన్స్ గదిలో విద్యుత్ షార్ట్ సర్యూట్ అయ్యింది. దీంతో సెల్లార్ సహా మెుదటి అంతస్తు వరకు పొగ వ్యాపించింది. ఒక్కసారి పొగలు రావడంతో ఆందోళనకు గురైన రోగులు, బంధువులు హాస్పటల్ నుంచి ప్రాణాలు చేతిలో పట్టుకుని బయటకు పరుగులు తీశారు. పొగలు రావడంతో ఏం జరుగుతుందో తెలియక వారంతా అయోమయానికి గురయ్యారు. ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరికొన్ని ఫోర్లకు పొగ వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. సెల్లార్‌లోని బ్యాటరీల మెయింటనెన్స్ గదిలో పరిస్థితిని అదుపు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com