స్వచ్ఛ శ్రీకాకుళమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఒబులేసు పారిశుధ్య కార్మికులు, నగర పాలక సిబ్బందికి పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి మహిళా కళాశాల వెనుక భాగంలో డ్రైనేజీ సమస్య ఉందని కమిషనర్‌కు సమాచారం రావడంతో మంగళవారం పారిశుధ్యపనులు చేపట్టారు. డ్రైనేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు ఇవ్వాల ని ఇంజనీరింగ్ సిబ్బందికి కమిషనర్ ఆదేశించారు. అలాగే పలు వసతి గృహాలను కమిషనర్ ఒబులేసు పరిశీలించారు.