వదర బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. ముమ్మిడివరం పరిధిలోని లంకాఫ్ ఠాణేలంక, గురజాపులంక, కూనాలంకలలో మంగళవారం టీడీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. వరద బాధితులను పరామర్శించి ప్రభుత్వం అందిస్తున్న సాయం గురించి అడిగి తెలుసుకున్నారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి రూ.3వేలు నష్ట పరిహారం, 25కిలోల బియ్యం, నిత్యావసర వస్తువుల కిట్లు పంపిణీ చేశారు. ఎంపీ గంటి హరీష్‌మాధుర్‌తలో కలిసి లంక భూముల నదీకోత నివారణకు ప్రణాళిక సిద్ధంచేసి రక్షణ చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, గొలకోటి దొరబాబు, చెల్లి అశోక్, తాడి నరసింహారావు, అర్థాని శ్రీనివాసరావు, పిల్లి నాగరాజు, నడిమింటి సూర్యప్రభాకరం, చిక్కాల అంజిబాబు, రంకిరెడ్డి రాంబాబు, గీసాల చంద్రరావు, దూడల స్వామి, గోదశి పుండరీష్, బొక్కా రుక్మిణి, మోర్త ప్రసాద్, దంగేటి శ్రీనివాస్, మిమ్మితి చిరంజీవి, నడింపల్లి శ్రీనివాసరాజు, పళ్ల రాజబాబు, చింతలపూడి కొండబాబు, గోదశి గణేష్, తొత్తరమూడి జ్యోతిబాబు, బూరుగ కల్యాణి, నేలపాటి వంశీ ఉన్నారు.