పల్నాడు జిల్లా, సత్తెనపల్లిలో అన్న క్యాంటీన్ పనులను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గురువారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చాలని అన్న క్యాంటీన్లు పెట్టిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదే అన్నారు. తెలుగుదేశం హయాంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని, అన్న క్యాంటిన్లలో ఐదు రుపాయలకే భోజనం ఏర్పాటు చేశారన్నారు. మూడు పూట్లా పేదలకు ఆహారం దొరికే విధంగా రాష్ట్రంలో అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. సైకో జగన్ రెడ్డి పాలనలో అన్న క్యాంటిన్లు రద్దు చేశారని మండిపడ్డారు. జగన్ పాలనలో అన్న క్యాంటిన్లు రద్దు చేసినా.. టీడీపీ నాయకులు ఉచితంగా అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేశారని.. సత్తెనపల్లిలో టీడీపీ నేత మల్లి 565 రోజులు ఉచితంగా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కొనియాడారు.