వలంటీర్ల ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం చేస్తున్న కసరత్తులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. తాను ఏర్పాటు చేసిన వ్యవస్థను కూడా నాటి సీఎం జగన్ విపరీతంగా నిర్లక్ష్యం చేసినట్టు కొత్త ప్రభుత్వం గుర్తించింది. గత ఏడాది ఆగస్టులోనే వలంటీర్ల వ్యవస్థ రద్దయిపోయింది. తాను అధికారంలో ఉన్నప్పుడే వలంటీర్ల వ్యవస్థకు కాలపరిమితి ముగిసినా నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. వలంటీర్ల కొనసాగింపుపై ఎలాంటి నిర్ణయం గత జగన్ సర్కార్ తీసుకోలేదు. గతేడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది మే వరకూ అక్రమంగానే వలంటీర్లు పని చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల్లో 1,53,908 మంది వలంటీర్లున్నారు. ఈ ఏడాది మార్చి-మే కాలంలో 1,09,192 మంది వాలంటీర్ల రాజీనామా/తొలగించనున్నారు. ప్రస్తుతమున్న వారితో నెలకు రూ. 10 వేల గౌరవ వేతనం చెల్లించాలంటే ఎంత మేరకు ఖర్చు అవుతుందనే అంశంపై సర్కార్ లెక్కలేస్తోంది. వలంటీర్ల గౌరవ వేతనం నిమిత్తం ఏటా రూ. 1848 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా.