గతంలో మాట తప్పను అని ప్రగల్భాలు పలికిన వైఎస్ జగన్ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్లు సమయం తీసుకున్నారని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మాటకు కట్టుబడి పెంచిన పెన్షన్లను అందజేస్తున్న ఘనత చంద్రబాబుదే అని చెప్పుకొచ్చారు. ప్రజల మధ్య పండగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.