అద్దంకి మండలం అద్దంకిలో ప్రస్తుతం తాత్కాలికంగా ఉన్న మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని శాశ్వతంగా అద్దంకిలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు త్రిమూర్తులు శుక్రవారం మంగళగిరిలో రాష్ట్ర మంత్రుల గ్రీవెన్స్ లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు వినతిపత్రం అందజేశారు. తగు చర్యలు తీసుకుంటారని మంత్రి తెలిపినట్లు త్రిమూర్తులు పేర్కొన్నారు.