ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పును స్వాతిస్తున్నామని దర్శి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. ఈమేరకు గురువారం ఆమె ఓప్రకటన విడుదలచేశారు. మాదిగల చిరకాల వాంఛ నెరవేరటం ఆనందంగా ఉందన్నారు. గత 30 సంవత్సరాలుగా వారు చేసిన పోరాట ఫలిత ఫలాలు త్వరలో అందుకుంటారన్నారు. సీఎం చంద్రబాబు ఎస్సీ వర్గీకరణకు చిత్తశుద్ధితో కృషి చేశారన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ కూడా ఈ విషయాన్ని బాహాటంగా తెలిపి టీడీపీ చిత్తశుద్ధితో వ్యవహరించిందని తెలపటం ఆనందంగా ఉందన్నారు. మాజీ సీఎం జగన్ మాదిగలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్పా వారికి న్యాయం చేసేందుకు ఏనాడు ప్రయత్నించలేదన్నారు. ఎస్సీల మధ్య్య చిచ్చుపెట్టి లభ్ధిపొందే కుటిల రాజకీయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవిషయాన్ని తెలుసుకున్న ఎస్సీలు గత ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ జరుగు తుందని గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పింఛ న్లు 1వ తేదీన క్రమం తప్పకుండా అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వం కే దక్కిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పింఛన్ రూ.వెయ్యి పెంచటానికి ఐదు సంవత్సరాల పట్టిందని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లు ఇచ్చిన మాట మేరకు ఒకేసారి రూ.వెయ్యి పెంచి 1వ తేదిన అందరికీ అందించటంతో అవ్వా, తాతల కళ్లల్లో ఆనందం వ్యక్తమవుతుందన్నారు.