రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన వాల్మీకిపురం, గంబోయనపల్లె, చింతపర్తి తదితర గ్రామాలలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎనటీఆర్ పింఛను కానుక నగదు ను పంపిణీ చేశారు. మండల వ్యాప్తంగా ఆయనకు నాయకులు, కార్య కర్తలు ఘన స్వాగతం పలికి గ జమాలలతో సత్కరించారు. ఈసంద ర్భంగా ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు సీఎం నారా చంద్రబాబునాయుడు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, అంతటి అవినీతి పనులను తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. అనంతరం వాల్మీకిపురం తోట వీధికి చెందిన కార్యకర్త బొక్కసం ఆనంద ఇంటికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య విషయమై అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన కంభం నిరంజనరెడ్డి, జనసేన పీలేరు ఇన ఛార్జి బెజవాడ దినేష్, మండల పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటరమణ, పీలేరు మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ బాషా, నాయకులు కృష్ణారెడ్డి, పులి సత్తారెడ్డి, పీవీ నారాయణ, రాజేం ద్రాచారి, చంద్రమౌళి, శేషాద్రిరెడ్డి, ద్వారకనాథరెడ్డి, కోసూరి రమేష్, మురళి, బొక్కసం రామకృష్ణ, కువైట్ సయ్యద్‌బాషా, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.