తిరుత్తణిలో టీటీడీ భూమి అన్యాక్రాంతంపై చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... జూలై మాసంలో శ్రీవారిని 22.13 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని తెలిపారు. హుండీ ద్వారా శ్రీవారికీ రూ.125కోట్ల 35లక్షలను భక్తులు కానుకల రూపంలో సమర్పించారన్నారు. కోటి నాలుగు లక్షల లడ్డులను భక్తులకు విక్రయించామని... 24.04 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాని స్వీకరించారని వెల్లడించారు అలాగే 8.67 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. శ్రీవాణి ట్రస్టు టికెట్లను కుదించామన్నారు.