గుర్రంకొండ మండలంలోని అన్ని గ్రామాల్లో సచివాలయ సిబ్బంది 97 శాతం పింఛన్లను పంపిణీ చేసినట్లు ఇనచార్జి ఎంపీడీవో నాగ శివారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా మండలంలో వివిధ రకాల కింద మొత్తం 6105 పింఛన్లు ఉండగా 5983 మందికి గురువారం పింఛన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే గుర్రంకొండ, తరిగొండ, చెర్లోపల్లె, తదితర గ్రామాల్లో టీడీపీ నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.