ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని పిఎన్ఆర్ కాలనీలోని ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. చల్లా వెంకట నరేంద్రబాబు అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న సిఐ మల్లికార్జునరావు, ఎస్సై కోటయ్యలు సంఘటన స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.