దేశ ప్రకృతి వ్యవసాయంతో మంచి ఫలితా లు సాధించవచ్చని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు అన్నా రు. రాజానగరం మండలం కలవచర్ల కృషి విజ్ఞాన కేంద్రంలోని ప్రకృతి వ్యవసాయ ప్రదర్శనా క్షేత్రాలను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా కేవీకే, జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం సంయుక్తం గా నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ ప్రదర్శనా క్షేత్రాల వివరాలను కేవీకే హెడ్ వీఎస్‌జీఆర్ నాయుడు అధికారులకు వివరించారు. వివిధ పద్ధతుల్లో నాటిన వరిసాగు, సంవత్సరం పొడవునా కూరగాయలు అందించే ఏటీఎం(ఎనీ టైం మనీ) మోడల్ విధానాలను జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారి బి.తాతారావు, సహాయ అధికారి వలి వివరించారు. అనంతరం రాజానగరం మండలంలోని నందరాడ, నరేంద్రపురం గ్రామాల్లో పర్యటించి ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరి శీలించి రైతులు ప్రగడ రాంబాబు, గుత్తుల సత్యనారా యణలను ప్రశంసించారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.