ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం అఖిల పక్షాలు, వివిధ ప్రజా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయడం హర్షణీయమే అయినా ఈ సమావేశానికి దూరంగా ఉండాని జనసేన నిర్ణయించింది. ఈ మేరకు జనసేన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పవన్ సంతకంతో విడుదలైన ఈ లేఖలో అఖిలపక్ష సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. అయితే బుధవారం సమావేశం ఏర్పాటు చేసి, మంగళవారం సాయంత్రం ఆహ్వానం పంపడం ఆక్షేపణీయంమని ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీస సమయం ఇవ్వకుండా,సమావేశం పూర్తి స్థాయి ఎజెండాను నిర్ణయించకుండా ఏర్పాటు చేసిన ఈ సమావేశం కేవలం మొక్కుబడి మాత్రమే అనిపిస్తోందని, దీనివెనక అధికార పార్టీ రాజకీయ లబ్ది కోసం అన్న సందేహాలను రేకెత్తిస్తున్నట్టు పేర్కొన్నారు.. ప్రత్యేక హోదా,విభజన హామీల సాధన కోసం సంఘటితంగా పోరాటం చేయడానికి జనసేన పార్టీ కట్టుబడివుందని, అయితే ఆ పోరాటంలో చిత్తశుద్ధి వున్నప్పుడు మాత్రమే జనసేన ఎవరితో అయినా చేతులు కలుపుతుంది మినహా ఇలా .మొక్కుబడి సమావేశాలు ఎటువంటి ఫలితాలు ఇవ్వవని పవన్ స్పష్టం చేస్తూ, తాము ఈ సమావేశానికి హాజరు కావటం లేదని తేల్చి చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa