బాలికను వేధిస్తున్న యువకుడిపై నున్న రూరల్ పోలీసులు ఆదివారం పోక్సో కేసు నమోదు చేశారు. పాయకాపురం, సుందరయ్యనగర్ ప్రాంతానికి చెందిన బాలిక(11) స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువు తోంది. అదే ప్రాంతానికి చెందిన యువకుడు అశోక్ ఎవరి తోనే ఫోన్లో మాట్లాడుతున్నట్లుగా బాలిక పట్ల అస భ్యంగా మాట్లాడుతున్నాడు. అదేమని ప్రశ్నించిన బాలిక తల్లిని కూడా దుర్భాషలాడాడు. దీంతో బాధితులు నున్న రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.