శ్రీకాకుళం జిల్లా, నందిగాం పరిధిలోని సైలాడ పంచాయతీ దేవాడలో భూమి విషయమై జరిగిన కొట్లాటపై కేసు నమోదైంది. నందిగాం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన లండ ధర్మారావుకు 11 సెంట్ల భూమి ఉంది. ఆ పక్కన లండ నాగరాజు, రామారావులకు చెందిన భూమి ఉంది. ఈ భూమిని ధర్మారావు కలిపేస్తున్నాడని రామారావు ఆదివారం ఉదయం గొడవకు దిగాడు. ఇది కొట్లాటకు దారి తీసింది. ఈ ఘటనలో తనను, తన కుమారుడిని నాగరాజు, రామారావు గాయపరిచారని ధర్మారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహ్మద్ అమీర్ఆలీ తెలిపారు.