ఎన్సీఈఆర్టీ సంస్థ 3, 6 తరగతి పాఠ్యపుస్తకాలలో రాజ్యాంగ పీఠికను తొలగించడం సరైంది కాదని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరేంద్ర, శ్రీ హర్ష ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం నెల్లూరు నగరంలోని రామచంద్రారెడ్డి భవన్లో జరిగిన ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ ప్రవేశిక మన దేశాన్ని సర్వసత్తాక, సోషలిస్ట్, లౌకిక, ప్రజాస్వామ్య, రిపబ్లిక్ ప్రకటించిందని తెలిపారు.