పర్యావరణ పరిరక్షణలో భాగంగా హరిత సొసైటీ సభ్యులు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమం చేపడుతున్నామని ఆ సంస్థ సభ్యులు ఆర్. కృష్ణ అన్నారు. ఆగస్టు 6న మంగళవారం హరిత ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తాళ్లవలస గ్రామంలో మొక్కలు నాటినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో హరిత సభ్యులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.