ఆముదాలవలస మండలం దూసి గ్రామ పరిధికి చెందిన పలు వ్యవసాయ క్షేత్రాలలో మంగళవారం వరి నారు తుంచడంపై అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు వ్యవసాయ సహాయకులు తమ్మినేని అలేఖ్య ఒక ప్రకటనలో తెలిపారు. నారు తుంచడం ద్వారా పంటలో కాండం తొలిచే పురుగును నివారించవచ్చని అవగాహన కల్పించామన్నారు. కాండం తొలిచే పురుగు ఆకుల కొనల వద్ద గోధుమ రంగులో గుడ్లు పెడుతుందని అన్నారు. పిలక దశలో గుర్తిస్తే పిప్రోనిల్ పిచికారి చేయాలన్నారు.