రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు రూ.5లకే పట్టెడన్నం పెట్టి ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లు కూటమి ప్రభుత్వం సిద్ధంచేసింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక నిరుపేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను సీఎం చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించా రు. అప్పట్లో వీటి నిర్మాణానికి ఒక్కొక్క దానికి సుమారు రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఖర్చుచేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019 వరకు పనిచేశాయి. లక్షలాది మంది ఆకలి బాదలు తీర్చాయి. అయితే ఆ తరువాత జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టడంతో మూతపడ్డాయి. ఐదేళ్లూ పాటు అన్న క్యాంటీన్లకు తాళాలు వేసే ఉంచారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ తాళాలు తెరుచుకున్నాయి. ఈనెల 15వతేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వీటిని ప్రారంభించనున్నారు.