ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలోనే రోడ్ల నిర్మాణం చేపట్టి తీరుతాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 07, 2024, 05:58 PM

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామిలు అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని జీలుగుమిల్లి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. గత ఐదేళ్లపాలనలో అభివృద్ధి లేదన్నారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజా సమస్యల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. పీఎజీఎస్‌వై నిధులు రూ.5.30 కోట్లతో రౌతుగూడెం నుంచి స్వర ్ణవారిగూడెం వరకు బీటీ రోడ్డు నిర్మాణం పనులు ఆయన ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్దికి రోడ్ల నిర్మాణం విషయమై సీఎం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారన్నారు. జీలు గుమిల్లి అభయాంజనేయస్వామి ఆలయంలో 108 కొబ్బరికాయలు కొట్టి ఎమ్మెల్యే మొక్కు చెల్లించారు. గడ్డమణుగు రవికుమార్‌, కరాటం సాయి, పసుపులేటి రాము, సర్పంచ్‌ సరియం రాజు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com