అనపర్తిలోని మూతపడ్డ 413 రైల్వే గేటు స్థానే ఫుట్ పాత్ బ్రిడ్జి నిర్మాణం కోసం అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేసిన కృషి త్వరలోనే సాకారం కానుంది. రైల్వే గేటు మూత పడడంతో గేటు ఆవ లిపైపు ఉన్న కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, రైస్‌మిల్లులు, పౌలీ్ట్ర ఫారాలకు వెళ్లే వ్యాపారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే నల్లమిల్లి ఇటీవల రాజమహేంద్రవరంలో రైల్వే డీఆర్‌ఎమ్‌తో జరిపిన చర్చల ఫలితంగా పుట్‌పాత్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు లభించాయి. అనపర్తి రైల్వే స్టేషన్ లో అమృత్‌భారత్ ఫేజ్ 1లో భాగంగా రూ.24 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులను మంగళవారం రైల్వే సీనియర్ ఇంజనీర్ శ్రీని వాస్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఫుట్ పాత్ బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని పరిశీలించి బ్రిడ్జి నిర్మాణం కోసం రూపొందించిన నమూనా చిత్రపటాన్ని పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పుట్‌పాత్ బ్రిడ్జి నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నామని, ఇక్కడి ప్రజల చిరకాలవాంఛగా ఉన్న బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ముందు రైల్వే స్థలం ఎక్కడి వరకూ ఉందో తేల్చి, అవ సరమైన స్థల సేకరణ చేసేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే అనపర్తిలో జన్మభూమి హాల్ట్‌ను సాధిస్తామని ఎన్నికల్లో ఎంపీ పురందేశ్వరి ఇచ్చిన హామీ లు కార్యరూపం దాల్చాయన్నారు. త్వరలోనే బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా ప్రారంభమౌతాయన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే సీనియర్ ఇంజనీర్ శ్రీని వాస్, గజశక్తి టీమ్ సభ్యులు, ఎన్డీయే నాయకులు సిరసపల్లి నాగేశ్వరరావు, తమలంపూడి సుధాకరరెడ్డి, సత్తి దేవదానరెడ్డి, కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, కర్రి వెంకటరామారెడ్డి, మామిడిశెట్టి శ్రీను, బాసి, మల్లిడి ఆదినారాయణరెడ్డి, బా బూరావు, కర్రి వెంకటరెడ్డి, ఒంటిమి సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.