ఏపీ మంత్రి వర్గ సమావేశం ముగిసిన అనంతరం రాజకీయ అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. మద్యం తయారీకి 16 శాతం ఖర్చు అవుతుంటే, 84 శాతం ఆదాయం తమ జేబుల్లోకి వచ్చేలా అమ్మకాలు జరిపారని మండిపడ్డారు. ఆదాయం ప్రభుత్వానికి రాకుండా వైసీపీ నేతలు దోచేశారన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి నాసిరకం బ్రాండ్లు తెచ్చారన్నారు. 2014 - 2019 మధ్య అన్ని బ్రాండ్ల్ అందుబాటులో ఉంచామన్నారు. నేతల జేబులు నింపుకునేందుకే ఎక్కడా డిజిటల్ పేమెంట్లు చేయలేదన్నారు.