నిమ్మనపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం మదనపల్లె సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్ ఆకస్మిక తనిఖీ చేసి ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరాతీశారు. అనంతరం వైద్యాధికారి డాక్టర్ ప్రత్యూష మాట్లాడుతూ ఆపరేషన చేసేందుకు డాక్టర్ లేరని, రోజుకు 180 మంది వరకు రోగులు ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు. అనంతరం అక్కడ ఉన్న రోగులు రాత్రి సమయంలో ఎవ్వరూ ఉండడం లేదని గంటల కొద్ది తలుపు కొట్టినా స్పందన లేదని సబ్‌కలెక్టర్‌కు తెలి పారు. కార్యక్రమం లో తహసీల్దార్ ధనంజేయులు, ఆర్‌ఐ రాంప్రసాద్ పాల్గొన్నారు.