అమరావతి: మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన కిడారి, సివేరు సోమ కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రెండో రోజు ఏపీ శాసనసభ సమావేశాలు జరిగాయి. కిడారి మృతిపై సీఎం చంద్రబాబు అసెంబ్లిdలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గిరిజనాభివృద్ధి కోసం పాటుపడిన కిడారిని హత్య చేయడం దారుణమన్నారు. బాక్సెట్, గనుల తవ్వకాలపై అసత్య ప్రచారంతో కిడారిని చంపారని పేర్కొన్నారు. కొన్ని అంశాలపై అభిప్రాయ బేధాలు రావచ్చని, అంతమాత్రాన మనుషుల ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa