చాపాడు మండలానికి ప్రభుత్వం 25 గోకులం షెడ్లు మంజూరు చేసినట్లు పశు వైద్యాధికారి మహమ్మద్ గౌస్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైతులు గేదెలు, పొట్టేలు, కోళ్ల ఫారం పెంపకం కోసం ఈ షెడ్లు నిర్మించుకోవచ్చునని ఆయన తెలిపారు. గేదెల షెడ్లు నిర్మాణానికి 90% సబ్సిడీ, మిగిలిన వాటికి 70% సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిపారు. గేదెల షెడ్లు నిర్మాణానికి ఒక యూనిట్ విలువ1. 15 లక్షల నుండి రెండు లక్షల 2. 30 లక్షల వరకు ఉంటుందన్నారు.