హిందూపురం మునిసిపాలిటీ పరిధిలో ఇంటి పన్ను చెల్లించి క్రమబద్ధీకరించుకోవాలని ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధరాదేవి సూచించారు. స్థానిక మునిసిపల్ కార్యాలయం ఆవరణంలో సోమవారం ఏర్పాటుచేసిన ఆస్తి పన్ను విధింపు వారోత్స వాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా వసుంధరదేవి మా ట్లాడుతూ... పట్టణంలో నాలుగు వేల మందికిపైగా ఇంటి పన్ను చెల్లిం చడం లేదన్నారు. అలాంటి వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలన్నారు. పట్టణంలో ఇంటి పన్ను చెల్లించని వారందరికి అవగాహన కల్పించాల న్నారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ శ్రీకాంతరెడ్డి, కౌన్సిలర్ మంజుల, నాగేంద్రమ్మ, సతీష్, నాయకులు పాల్గొన్నారు.