విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి దూరంగా ఉండనుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు నిర్ణయంతో పోటీకి దూరంగా కూటమి నేతలు ఉండనున్నారు. మంగళవారం నాడు టెలికాన్పరెన్స్‌లో తన అభిప్రాయాన్ని కూటమి నేతలకు చంద్రబాబు తెలిపారు. గెలవాలంటే పెద్ద కష్టం కాదు...కానీ హూందా రాజకీయాలు చేద్దామని నేతలతో అన్నారు. చంద్రబాబు నిర్ణయాన్ని కూటమి పక్షనేతలు, జిల్లా నేతలు ఆమోదించారు. నాటి స్థానిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ అక్రమాల కారణంగా నాడు ఎన్నికల్లో పోటీకీ దూరంగా టీడీపీ ఉందని చెప్పారు. అధికార మార్పిడి తర్వాత స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున కూటమి వైపు వచ్చారని వివరించారు. గెలుపు కాదు ప్రజల అభిప్రాయలు, విలువలు ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం ముందున్న లక్ష్యం రాష్ట్ర పునర్నిర్మాణం అన్నివర్గాల అభివృద్ధి అని చంద్రబాబు ఈ సమావేశంలో కూటమి నేతలకు చంద్రబాబు తెలిపారు.