అమరావతి ప్రాంతం ఐకానిక్ ప్రదేశంగా మారే అవకాశం ఉందని మంత్రి పార్థసారధి తెలిపారు. హారతులతో పాటు ఒక ఆలయ నిర్మాణం చేయాలని అన్నారు. పుణ్యక్షేత్రం కారణంగా నిత్యం భక్తుల రద్దీ పెరుగుతుందని చెప్పారు. వరదల సమయంలో తట్టుకునేలా ఘాట్ ఎత్తు పెంచాలని అధికారులను ఆదేశించారు. బోటింగ్ స్పోర్ట్స్ పెడితే ప్రజలను ఆకట్టుకోవచ్చని వివరించారు. నదికి ఇరువైపులా అభివృద్ధి చేస్తే మంచి పర్యాటక ప్రదేశం అవుతుందని చెప్పారు. ఆధ్యాత్మికం, హాలిడే స్పాట్ వల్ల ప్రజలు కూడా ఆదరిస్తారని అన్నారు. గత ప్రభుత్వం ఈ ఘాట్‌ను పూర్తిగా విస్మరించిందని చెప్పారు. ఇప్పుడు కోట్ల రూపాయలతో మళ్లీ పనులు చేయాల్సి వస్తుందని మంత్రి పార్థసారధి పేర్కొన్నారు.