అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంట్లో ఈ రోజు ఉదయం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 15 మంది అధికారులతో కూడిన ఏసీబీ బృందం, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసానికి ఈ ఉదయం 5 గంటలకు చేరుకుని సోదాలు జరిపింది. ఈ సందర్భంగా పలు రికార్డులు మరియు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.అనంతరం, ఈ కేసులో కీలకంగా భావిస్తున్న జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఆయనపై ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. రాజీవ్ పేరును ఏ1గా చేర్చింది. అలాగే ఏ2గా జోగి వెంకటేశ్వరావు పేరు చేర్చింది.