అన్న క్యాంటీన్లు పార్టీ ఏర్పాటు చేసినట్లు, అన్నింటికీ పచ్చ రంగు పులిమారని, నిజానికి ఆ ఖర్చు ప్రభుత్వం పెట్టుకుందని అంబటి రాంబాబు గుర్తు చేశారు. తాము గతంలో కొన్ని పంచాయతీలకు తమ పార్టీ పతాకానికి దగ్గరగా ఉండే రంగులు వేస్తే.. టీడీపీ నాయకులు, చంద్రబాబుగారు అందరూ విమర్శించారని, చివరకు కోర్టులనూ ఆశ్రయించారని తెలిపారు. అదే ఈరోజు వాళ్లు అంతకు మించి పంచాయతీలకు పచ్చ రంగు వేస్తున్నారని, అన్న క్యాంటీన్లన్నింటికీ పచ్చ రంగు వేస్తున్నారని, ఇది ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర నెలల్లోనే ప్రజలు.. ముఖ్యంగా పేదలు నానా ఇబ్బంది పడుతున్నారని, అన్ని పథకాలు ఆపేసి, ప్రజలకు మేలు చేయకుండా, ఏదో ఇంత అన్నం పెట్టి, వారిని మభ్య పెట్టాలనుకోవడం ఏ మాత్రం సరి కాదని అంబటి రాంబాబు తేల్చి చెప్పారు.