దేశ స్వతంత్రం కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారని రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. విశాఖ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి అనగాని ముఖ్య అతిధిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, పోరాటాలు ఫలితంగా స్వతంత్రం సాధించామన్నారు. భగత్ సింగ్ , సుభాష్ చంద్రబోస్ నినాదాలు ఆనాడు ప్రజలను కదిలించాయని తెలిపారు. ఏపీ నుంచి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, గౌతు లచ్చన్న వంటి ఎంతో మంది త్యాగ మూర్తులు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారని గుర్తుచేశారు.