దేశ స్వాతంత్రం కోసం తెలుగు నేల చాలా కార్యక్రమాలు చేసిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా లోకేష్ హాజరయ్యారు. జిల్లా పోలీసుల వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... స్వాతంత్రం కోసం గుంటూరు జిల్లా వాసులు చాలా మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఈ రోజు వేడుకలు తనకు జీవితం మొత్తం గుర్తు ఉంటుందని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. దేశం అంటే భక్తి ఉండాలని సూచించారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు శాంతి, అహింస అనే ఆయుధాలుగా స్వేచ్ఛను సాధించారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు ప్రజా సంఘాలకు మాట్లాడే స్వేచ్ఛ వచ్చిందని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అందరి కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని అన్నారు. సీఎం చంద్రబాబు హామీలకు అనవసరమైన ఆంక్షలతో సంక్షేమ పథకాలు కట్ చేయమని వివరించారు. ఏడాదికి రూ. 250 పింఛన్ పెంచడం కాదని.. ఒకేసారి వెయ్యి రూపాయలు తమ ప్రభుత్వంలో పెంచామని గుర్తుచేశారు. చంద్రబాబు ఇచ్చిన ఆరు పథకాల గ్యారంటీకి కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.