గత ప్రభుత్వం అన్న క్యాంటీన్‌లను రద్దు చేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. మీ పేరు పెట్టుకుని అన్నం పెట్టండని అడిగా.. మీరు పెట్టలేకపోయినా దాతలు వస్తారని చెప్పాం అయినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. సెప్టెంబర్ నెలాఖరులోగా 203 అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లోని మండల కేంద్రాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. పేదవాళ్లను తిండి పెట్టడం మనందరి కనీస బాధ్యత అని అన్నారు. హరేకృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు ఇవ్వాలని సీఎం పిలుపునిచ్చారు. ‘‘శాశ్వతంగా కొనసాగించే కార్యక్రమం కావాలని నా ఆకాంక్ష’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.