ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏక్​ తేరా.. ఏక్​ మేరా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 19, 2024, 03:51 PM

లంచం తీసుకున్న సొమ్ము పంచుకుంటూ ట్రాఫిక్​ పోలీసులు కెమెరాకు చిక్కారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో తెగ వైరల్​ అయ్యింది. శనివారం ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల నుంచి వసూలు చేసిన లంచం సొమ్మును నిజాయితీగా వాటాలు వేసుకున్నారు. గాజీపూర్​లోని చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఈ నిర్వాకానికి పాల్పడ్డారు. అయితే, వారి వాటాల పంపకం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డవుతోందనే విషయం గుర్తించలేదు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వరకు చేరింది. దీంతో ఆయన సీరియస్​గా స్పందించారు. వెంటనే సదరు ట్రాఫిక్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. వారిపై డిపార్ట్ మెంటల్ ఎంక్వైరీకి ఆదేశించారు. ‘లంచం నోట్లు పంచుకుంటూ కెమెరాకు చిక్కిన ఇద్దరు అసిస్టెంట్ సబ్ ఇన్​స్పెక్టర్లు, ఓ కానిస్టేబుల్​ను సస్పెండ్ చేశాం. ప్రాథమిక విచారణ తర్వాత వారిపై చర్యలు తీసుకున్నాం. వారిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించాం’అంటూ ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా ఎక్స్​ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com