ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి రైతుకు రూ.6వేల పెట్టుబడి సాయం

national |  Suryaa Desk  | Published : Fri, Feb 01, 2019, 08:30 PM

చిన్న, సన్నకారు రైతులకు కచ్చితమైన ఆదాయం ఉండేందుకు.. ప్రత్యక్షంగా పెట్టుబడిని అందించేందుకు హెక్టారుకు రూ.6 వేలు ఇచ్చే పథకాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి పీయుష్ గోయల్ ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఈ పథకం అమలవుతుంది. ఈ నిధులను నేరుగా రైతు ఖాతాలోకే పంపిస్తారు. ఏడాదిలో మూడు దఫాలుగా ఈ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా చెల్లిస్తారు. 2 హెక్టార్లకన్నా తక్కువ లేదా ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఈ పథకం అమలు చేయనున్నారు. దేశంలోని 12 కోట్ల మంది రైతులకు ఈ పథకం లబ్ధి చేకూరుతుందని పీయూష్ గోయల్ ప్రకటించారు. దీనివల్ల ప్రభుత్వంపై ఏటా రూ.75 వేల కోట్ల భారం పడుతుందన్నారు. ఈ పథకం వల్ల రైతులు గౌరవంగా జీవించేందుకు అవకాశం లభిస్తుందన్నారు.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa