ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ద్రవ్యోల్బణం 4.6శాతానికి

national |  Suryaa Desk  | Published : Fri, Feb 01, 2019, 08:56 PM

ద్రవ్యోల్బణం 4.6శాతానికి తీసుకొచ్చామని మంత్రి పీయూష్ పేర్కొన్నారు. సంస్థాగతమైన ఆర్థిక సంస్కరణలలో ముందుకు సాగుతున్నామని, రికార్డు స్థాయిలో ఎఫ్‌డీఐలు భారత దేశానికి వచ్చాయి. జీఎస్‌టీ సహా పన్నుల వ్యవస్థల్లో సంస్కరణలు అమలు చేస్తున్నాం. రూ.3లక్షల కోట్ల మొండి బకాయిలను వసూలు చేశాం. రేరా చట్టం ద్వారా బినామీ లావాదేవీలను నిరోధించగలిగాం. మా ప్రభుత్వ పాలన దేశంలో ప్రతి ఒక్కరి ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. మా ప్రభుత్వం ప్రతి కార్యక్రమాన్ని నిజాయతీగా అమలు చేస్తోంది. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లను దేశానికి తిరిగి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గ్రామీణ భారతంలో 98శాతం మరుగుదొడ్లు నిర్మించామన్నారు.
మధ్యంతర బడ్జెట్లోని ముఖ్యాంశాలు :
​- సంస్థాగతమైన ఆర్థిక సంస్కరణలలో ముందుకు
​- రికార్డు స్థాయిలో ఎఫ్‌డీఐలు భారత దేశానికి వచ్చాయి.
​- జీఎస్‌టీ సహా పన్నుల వ్యవస్థల్లో సంస్కరణలు అమలు
​- ​2020కు నవ భారతం నిర్మిస్తాం
- ​3 లక్షల కోట్ల డిఫాల్ట్ లోన్లు రికవర్ చేసాం
​- గ్రామీణ భారతంలో 98శాతం మరుగుదొడ్లు నిర్మించాం.
-​మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకానికి 60 వేల కోట్లు ఖర్చు చేశాం.
​- మార్చి వరకు దేశంలో అన్ని ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చాం.
- ​22 రకాల పంటలకు మద్దతు ధర పెంచాం.
​- ప్రధానమంత్రి సడక్‌ యోజనకు.19వేల కోట్లు ఖర్చు చేశాం.
​- ఇప్పటివరకూ 3వేల కోట్ల పేదల ధనం ఆదా అయింది. ​
​- 2014కు ముందు బస్సు సౌకర్యం లేని అన్ని గ్రామాలకు ఆ సౌకర్యం కల్పించాం
​-​పేద రైతులకు ఆదాయం పెంపును చర్యలు చేపట్టాం.
​- కొత్త పెన్షన్‌ విధానం సరళీకరిస్తాం!
​​ - పెన్షన్‌లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంపు.
​​ - గోకుల్‌ మిషన్‌ కోసం రూ.750కోట్లు కేటాయిస్తున్నాం.
​- గో ఉత్పాదకత పెంచడానికి రాష్ట్రీయ కామ్‌ధేన్‌ ఆయోగ్‌ ఏర్పాటు
- గోకుల్ మిషన్ కు ఈ సంవత్సరం రూ. 750 కోట్ల కేటాయింపులు
- పెన్షన్ లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంపు
- ఉజ్వల యోజన కింద 8 కోట్ల ఉచిత వంటగ్యాస్ కనెక్షన్లు.
- ముద్ర యోజనలో రూ. 7.23 లక్షల కోట్ల రుణాలు.
- వన్ ర్యాంక్ - వన్య పెన్షన్ కోసం రూ. 35 వేల కోట్లు.
- త్వరలోనే 'వందే భారత్' ఎక్స్ ప్రెస్ రైలు పరుగులు.
- కేంద్ర స్థాయిలో ప్రత్యేక మత్స్య శాఖ ఏర్పాటు.
- పశు సంవర్థక, మత్స్య పరిశ్రమలకు 2 శాతం వడ్డీ రాయితీ.
- ప్రధానమంత్రి కౌశల్ యూజన ద్వారా కోటి మంది యువతకు లబ్ది.
- రైల్వేలకు బడ్జెటరీ సపోర్ట్ కింద రూ. 64,587 కోట్లు.
- మిజోరం, మేఘాలయా రాష్ట్రాలను రైల్వేతో అనుసంధానం.
- ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూ. 15,166 కోట్ల కేటాయింపు.
- గడచిన ఐదేళ్లలో సౌర విద్యుత్ ఉత్పత్తి 10 రెట్లు పెరిగింది.
- గడచిన ఐదేళ్లలో 34 కోట్ల జన్ ధన్ అకౌంట్ల ప్రారంభం.
- ప్రత్యక్ష పన్నుల ద్వారా ఆదాయం రూ. 12 లక్షల కోట్లు.
- సెక్షన్ 80సీ పరిమితి రూ. లక్ష నుంచి రూ. 1.50 లక్షలకు పెంపు.
- ఇక పేద, మధ్యతరగతి ప్రజలంతా 0 నుంచి 5 శాతం పన్ను పరిధిలో మాత్రమే.
- సినిమా పరిశ్రమ 12 శాతం జీఎస్టీ పరిధిలోకి.
- సినిమా షూటింగ్ అనుమతులకు సింగిల్ విండో.
- బినామీ ఆస్తుల వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వాటిని అటాచ్ చేశాం.
- 3 లక్షలకు పైగా బినామీ కంపెనీలను డీ రిజిస్టర్ చేశాం.
- గడచిన సంవత్సరం కోటి మందికి పైగా పన్ను చెల్లించారు.
- ఇంతమంది నుంచి రిటర్నులు దాఖలు కావడం ఇదే తొలిసారి.
- వచ్చే ఐదేళ్లలో ఇండియా 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా రూపాంతరం
- 'ఈజ్ ఆఫ్ బిజినెస్' తో పాటే 'ఈజ్ ఆఫ్ లివింగ్'
- డిజిటల్ ఇండియా కలను సాకారం చేసి చూపిస్తాం.
- ఎలక్ట్రిక్ వాహనాలకు మరిన్ని రాయితీలు.
- ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహిస్తాం.
- 2025 నాటికి ప్రతి దేశ పౌరుడికీ ఆరోగ్య బీమా ఉంటుంది.
- వైద్య ఖర్చులకు ఒక్క రూపాయి కూడా పెట్టని పరిస్థితిని తీసుకు వస్తాం.
- ఇళ్ల కొనుగోలుదారులకు జీఎస్టీ మినహాయింపులో అతి త్వరలోనే నిర్ణయం.
- జాతీయ విద్యా మిషన్ కు రూ. 38,572 కోట్లు.
- చైల్డ్ డెవలప్ మెంట్ స్కీమ్ కు రూ. 27,584 కోట్లు.
- ఎస్సీ, ఎస్టీల అభ్యన్నతికి రూ. 76 వేల కోట్లు.
- నెలకు వసూలవుతున్న పన్ను మొత్తం రూ. 97,100 కోట్లు.
- గడచిన ఐదేళ్లలో రాష్ట్రాల పన్ను వసూళ్లు సాలీనా 14 శాతం మేరకు పెరిగాయి.
- జీఎస్టీ అమలుతో వినియోగదారులపై రూ. 80 వేల కోట్ల భారం తగ్గింది.
- చాలా నిత్యావసర వస్తువులు 5 శాతంలోపు పన్ను పరిధిలోనే ఉన్నాయి.
- రూ. 5 లక్షలలోపు సంవత్సరాదాయం ఉన్న వారికి ఫుల్ టాక్స్ రిబేట్.
- రూ. 6.50 లక్షల వరకూ వార్షికవేతనం ఉంటే, పీఎఫ్, బీమా, సేవింగ్స్ తదితర స్కీముల్లో పెట్టుబడులు పెట్టి ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు.
- పోస్టల్, బ్యాంకు డిపాజిట్లపై టీడీఎస్ పరిమితి పెంపు.
- టీడీఎస్ పరిమితి రూ. 10 వేల నుంచి రూ. 40 వేలకు పెంపు.
- స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ. 40 వేల నుంచి రూ. 50 వేలకు పెంపు.
- ఇంటి అద్దెలపై టీడీఎస్ రూ. 180 లక్షల నుంచి రూ. 2.40 లక్షలకు పెంపు.
- కేంద్ర ప్రాయోజిత పథకాలకు రూ. 3.27 లక్షల కోట్లు.
- ప్రణాళికా వ్యయం రూ. 3.36 లక్షల కోట్లు.
- గత సంవత్సరంతో పోలిస్తే 13.3 శాతం పెరిగిన ప్రభుత్వ ఖర్చు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa