సుప్రీంకోర్టు, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సెప్టెంబరు 14వ తేదీన గాజువాక కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు విశాఖ జిల్లా 13వ అదనపు జడ్జి జి.షణ్ముఖరావు పేర్కొన్నారు. గాజువాక కోర్టు ప్రాంగణంలో పోలీస్ అధికారులు, న్యాయమూర్తులు, న్యాయవాదులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భూ తగాదాలు, రెవెన్యూ, బ్యాంకులు, కుటుంబ తగాదాలు, కార్మిక, మోటారు ప్రమాద పరిహార ట్రిబ్యునల్, ఇన్సూరెన్స్, విద్యుత్, నీరు, టెలిఫోన్, యుటిలిటీ గొడవలు, రాజీపడ్డదగ్గ అన్ని క్రిమినల్ కేసులు, ట్రాఫిక్, మునిసిపల్ వివాదాలు వంటి వాటిపి పరిష్కరించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో కార్యక్రమంలో జడ్జిలు రాజేంద్రబాబు, ప్రదీప, వై.శ్రీలక్ష్మి, పల్లవి, పలువురు పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.