ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రేవంత్ సర్కార్ బాటలో నడవబోతుందా.. టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో అలాంటి సంకేతాలు వస్తున్నాయి. ఏపీలో కూడా హైడ్రా వస్తుందన్నారు భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన వారు.. వారంతట వారే ఇచ్చేయాలన్న మంత్రి నారాయణ వ్యాఖ్యలపై గంటా స్పందించారు. విశాఖలో పార్కును ఆక్రమించి నిర్మాణాలు చేశారని.. అక్రమ నిర్మాణాలు చేపడితే హైడ్రా తరహా చర్యలు మొదలు పెట్టాల్సి ఉంటుందన్నారు. గంటా శ్రీనివాసరావు విశాఖపట్నంలోని కాపులుప్పాడ డంపింగ్ యార్డును ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో జీవీఎంసీకి ప్రత్యేక స్థానం ఉందని.. జీవీఎంసీ, ఉడా అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. అక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌ను సందర్శించారు. 2014-2019 మధ్య ముఖ్యమంత్రి తీసుకొచ్చామని.. తంగుడుమిల్లిలో ఈ వేస్ట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేశామన్నారు. కానీ అప్పుడు స్థానికులు దానిని వ్యతిరేకించారని.. మళ్లీ ఇక్కడే కొనసాగించాల్సి వచ్చిందన్నారు. గత ప్రభుత్వం ఈ ప్లాంట్ పూర్తిగా నిర్వీర్యం చేసిందని.. ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ ప్లాంట్‌ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమయ్యాయన్నారు ఏపీ మంత్రి నారాయణ. రుషికొండ భవనాలపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారని.. అందరితో చర్చించి ఆయన త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటారన్నారు. అంతేకాదు ఇతర దేశాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిర్వహణలో దుర్వాసన లేదని.. ఈ విధానంపై అధ్యయనం చేసి రాష్ట్రంలో కూడా అమలు చేస్తామన్నారు. గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో ఒక్క మంత్రి కూడా ఈ ప్లాంట్‌కు రాలేదన్నారు మంత్రి. గతేడాది రూ.450 కోట్ల నిధులు వస్తే వాటినీ పక్కదారి పట్టించారని ఆరోపించారు.
ఇతర దేశాల్లో పోల్చుకుంటే ఇక్కడ ఉన్న ప్లాంట్ మరెక్కడా లేదన్నారు మంత్రి. సింగపూర్ లాంటి దేశాల్లో కూడా ఇలాంటి ప్లాంట్లు నాలుగు మాత్రమే ఉన్నాయని.. ముఖ్యమంత్రి కూడా టోక్యో లో ఉన్న ప్లాంట్ను కూడా పరిశీలించారన్నారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలో కూడా ఇలాంటి ప్లాంట్ పెట్టేందుకు టెండర్లను పిలవడం పిలిచామన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధి కోసం కేంద్ర నుంచి నిధులు కోసం ప్రయత్నం చేస్తున్నామని.. నిధులు రాగానే మున్సిపాలిటీ బలోపితం చేయడానికి కృషి చేస్తామన్నారు. ఇప్పటకే ముఖ్యమంత్రి కి చెప్పగానే వెంటనే 150 కోట్లు విడుదల చేశారన్నారు. చంద్రబాబు విజన్ ఉన్న ముఖ్యమంత్రి అని.. 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని ఆ డబ్బు మున్సిపల్ శాఖకు తిరిగి పంపించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో టీడీఆర్ కుంభకోణాలపై వచ్చే నెల నాటికి స్పష్టత వస్తుందని.. గతంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేశారని.. వాటిని వెంటనే వదులుకోవాలన్నారు. నిర్మాణాలు వదులుకోకపోతే తామే స్వాధీనం చేసుకుంటామని.. ఆక్రమించి నిర్మించిన భవనాల్లో కొన్నింటిని ఇప్పటికే కూలగొట్టారన్నారు. సెప్టెంబర్ 13న మరో 75 క్యాంటీన్లు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు.